Sunday, March 15, 2015

చిరంజీవి 150 వ చిత్రం.

​​
రామ్ చరణ్ తన తండ్రి తీసే 150 వ చిత్రాన్ని నిర్మించేందుకు అన్ని సిద్దం చేసుకుని మంచి కథ కోసం వేచి చూస్తున్నాడు. ధానిలో భాగంగా పలు దర్శకుల వద్దకు వెళ్ళి మంచి కథ చెప్పమని అడిగాడు.

దర్శకరత్న దాసరి నారాయణ గారితో తో సంభాషణ:

రామ్: నమస్కారం సర్

దాసరి: ఆశీస్సులు ఆశీస్సులు. నిన్ను చూస్తే ముచ్చటగా ఉందయ్యా! నేను మీ నాన్నకు నేర్పిన సంస్కారం నీక్కూడా అబ్బింది.

రామ్: అది సరే కానీ నేను నాన్న గారితో ఒక సినిమా తియ్యాలనుకుంటున్న. దానికి మీరోక మంచి కథ చెప్పాలి సర్. 

దాసరి: అలాగే తీసేద్దాం. నా దగ్గర అద్భుతమైన కథ ఉంది. అది క్రిస్టొఫర్ నోలన్ కావాలని అడిగాడు కానీ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు అని నేనే ఇవ్వను అని చెప్పాను.

రామ్: ఇంటర్‌స్టెలర్ లాంటి సినిమా నా?

దాసరి: అది చాలా పాత కాలం మూవీలా ఉంటుంది. నేను అనుకున్న కథ ఎర్రబస్సు సినిమా ల వచ్చే ఒక దశాబ్దం పాటు గుర్తుండిపోయేలా ఉంటుంది.

రామ్: దానికి OS  లో ఏదో 250 డాలర్లు మాత్రమే వచ్చాయి కదా!

దాసరి: అది ఆ నలుగురు చేసిన కుట్ర. ఓ సారీ... ఆ ముగ్గురు చేసిన కుట్ర... థియేటర్ లో తీసేయ్యకుండా ఉండి ఉంటే ఈ పాటికి 1 మిలియన్ వచ్చేది.


రామ్: కథ విషయానికి వద్దాం సర్.

దాసరి: హీరో ఒక మేజర్. దేశం కోసం సరిహద్దు ప్రాంతంలో ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాడుతుంటాడు.

రామ్: అర్ధం అయ్యింది సర్ సినిమా అంతా! నేను నాన్నగారికి చెప్పి మీకు ఫోన్ చేస్తాను. సెలవు!



బి. గోపాల్ గారితో సంభాషణ:

రామ్: నమస్కారం సర్.

గోపాల్: బావున్నవా చరణ్? నాన్నగారు ఎలా ఉన్నారు.

రామ్: బావున్నారు సర్. నేను నాన్నగారితో సినిమా తీస్తున్నాను ఒక మంచి కథ చెప్పండి.

గోపాల్: అదెంత పని. సరే చెప్తాను విను. 

సినిమా ప్రారంభ సన్నివేశం: ఒక చిన్న పల్లెటూల్లో హోటెల్ లో పని చేసే క్లీనర్ వాళ్లింట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉంటాడు హీరో. తనకి అన్ని విషయాల్లో సాయం చేస్తూ ఉండి క్లీనర్ ని కాస్త ఆ రాష్ట్రం లో కెల్ల అతి ధనవంతుడిగా మారుస్తాడు. అది చూసి ఓర్వలేని విల్లన్ ఎలాగైనా ఆ సర్వర్ ని ఛంపించడానికి మనుషులని పంపిస్తాడు. అప్పుడు హీరో అందరినీ కొట్టి విల్లన్ దగ్గరికి పార్సల్ చేస్తాడు. అది చూసి విల్లన్ ఇవి మామూలు వాడు కొట్టిన దెబ్బలు కావు అసలు వాడెవడో తెల్సుకుందాం అని హీరో దగ్గరికి వెళ్ళి తనని చూసి ఆశ్చర్యపోతాడు. అసలు ఎందుకు ఆశ్చర్యపోయాడు. హీరో అక్కడికి వచ్చి ఆ సర్వర్ కి ఎందుకు సహాయం చేస్తున్నాడు? ఫ్ల్యాష్‌బ్యాక్ ఏంటి అనేది ద్వితీయార్ధం.

ద్వితీయార్ధం లో హీరో గారు ఎవరు అనేది తెలుస్తుంది. ఆయన అమెరికా కి ప్రెసిడెంట్. వాళ్ళ నాన్నగారు చనిపోతూ చనిపోతూ ఒక నిజం చెప్పి చనిపోతాడు. ఒకరోజు వాళ్ల నాన్నగారు ఆ చిన్నపల్లెటూల్లో వెళుతూ ఉంటే సరిగ్గా హోటెల్ ముందు కార్ చెడిపోతుంది. ఒక టీ తాగుదాం అని హోటెల్ లోపలికి వెళ్ళి తాగుతాడు కానీ ఇవ్వడానికి డబ్బులుండవు. అప్పుడు ఆ సర్వర్ పరవాలేదు సర్ తర్వాత ఇవ్వండి అని అంటాడు. అప్పట్నుండి ఆ సర్వర్ కి డబ్బులు ఇవ్వలేకపోయానే అని మంచం పట్టి చనిపోయే ముందు ఈ నిజాన్ని చెప్పి ఎలాగైనా సర్వర్ కి సహాయం చెయ్యమని చెప్పి చనిపోతాడు. అప్పుడే హీరో గారు తన దగ్గరున్న ఆస్తి మొత్తాన్ని ప్రజలకు పంచిపెట్టి ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి సర్వర్ కి సహాయం చేస్తూ ఉంటాడు.

అలా తన త్యాగ గుణాన్ని మంచితానాన్ని పసిగట్టిన ప్రజలు ఆయనకి దేశ ప్రధానిపదవి ఇచ్చి సత్కరిస్తారు చివరిలో. ఇది టూకీగా సినిమా. ఎలా ఉంది రామ్

రామ్: సార్ ఇలాంటివి చాలాసార్లు విన్నాను చూశాను అనుకుంటున్నాను.

గోపాల్: రోజు తింటున్నామని అన్నం మీద అసహ్యం పుడుతుందా? ఇది కూడా అంతే నువ్వేం ఆలోచించకు సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుంది.

రామ్: ఉంటాను సర్

                                                                                                        (సశేషం)

1 comment: