మొట్టమొదటి సారిగా ఒక సినిమా కి రివ్యూ రాయాలని అనిపించింది. ఎందుకంటే ఏం చెయ్యాలో తెలీక ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఆ సినిమానే టెంపర్. ఈ రివ్యూ చదివి సినిమా చూడాలా వద్దా అని మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే సినిమా బాగుందా బాలేదా అని విశ్లేషించే అంత విషయం అయితే నా దగ్గర లేదు. నేను ఒక డాటా అనలిస్ట్ ని కానీ మూవీ అనలిస్ట్ ని కాదు కావున అసలు ఇది రివ్యూనేనా కాదా అనే అనుమానం వస్తే నన్ను కొంచెం పెద్ద మనసుతో క్షమించెయ్యండి.
తారాగణం: అందరూ తెలిసిన నటీనటులే
నాకు నచ్చినవి:
మిగతావన్నీ పక్కన పెడితే కధనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పూరీ గారు పకడ్బందీగా రాసుకున్నారు. ప్రతి చిన్న సన్నివేశాన్ని కూడా లింక్ చేస్తూ ద్వితీయార్ధంని రాసుకున్న విధానం సూపర్. చాలా చిన్న సన్నివేశమే కదా అని అనుకున్నది కూడా రెండవ భాగం కి వచ్చేసరికి దాని విలువని తెలియచెస్తుంది.
ఉదాహరణకి NTR కాజల్ ని నువ్వేం తింటావ్ అని అడిగినప్పుడు పప్పు ఆవకాయ అప్పడం లాంటివి చెబుతుంది. అది చాలా మామూలు సన్నివేశం కానీ చివరిసారిగా నువ్వేం తింటావ్ అని పోలీసులు NTR ని అడిగినప్పుడు తాను కూడా అది గుర్తుకు తెచ్చుకుని చెప్పడం వల్ల ఆ సన్నివేశం అనుకున్న దానికన్నా ఎక్కువగా పండింది. ఇలాంటివి చాలా ఉన్నాయి.
మొదటి భాగంలో హీరోని అసహ్యించుకునే వరకు వెళ్తాం కాబట్టి ప్రేక్షకులతో ఆ charecter కనెక్ట్ అయ్యినట్టే. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ మంచి వాడిగా మారడానికి గల కారణం కూడా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. చాలా సినిమా ల్లో చూసినట్టు అకస్మాత్తుగా హీరో మంచివాడుగా మారడంలా కాకుండా దానికి బలమైన సన్నివేశాలు రాయడంలో దర్శకుడు విజయం సాధించాడు.
చివరి వాక్యం: NTR అభిమానులు సినిమా ఎలాగూ చూస్తారు. మిగతావాళ్ళకి సినిమా నచ్చుంటుందో లేదో తెలుసుకోవాలి అంటే వాళ్ళు కూడా సినిమా చూసి నిర్ణయం తీసుకుంటేనే ఉత్తమం.
తారాగణం: అందరూ తెలిసిన నటీనటులే
నాకు నచ్చినవి:
- కాజల్ పళ్ళు. ఎందుకంటే చాలా తెల్లగా ఉన్నాయి అని మనకు చాలా సార్లు చూపించింది కాబట్టి.
- ప్రకాష్‌రాజ్ మరియు NTR తాగి పడేసిన మందు బాటల్స్ ఆకారం. వీలైతే అవన్నీ తెచ్చుకుని మా ఇంట్లో పెట్టుకోవాలి అన్నంత బాగా నచ్చాయి ఆ బాటల్స్.
- NTR వేసుకున్న చొక్కాలు.
- ప్రకాష్‌రాజ్ ధరించే షార్ట్స్. ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని కొనుక్కుందాం అనుకుంటున్నాను.
- 2వ పాటలో ఒక ఫ్రేమ్ లో కాజల్ నడుచుకుంటూ వచ్చే విధానం.
నాకు నచ్చని అంశాలు:
- ఒకసారి మధురిమ ఏడ్చే సన్నివేశంలో కళ్ళకి కాటుక సరిగ్గా పెట్టుకోలేదు అనిపించింది. మేకప్ వేసిన వాళ్ళు కొంచెం చూసుకుని ఉండాల్సింది.
- అలీ మీసాలు
- సినిమాలో 20 పైన కుక్కలున్నాయి. అవి కూడా నాకు నచ్చలేవు. ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
- చివరి విల్లన్ సుబ్బరాజు NTR చేతుల్లో కుక్కచావు చావడానికి భయపడి తనంతాల తానే ఆత్మహత్య చేసుకోవడం. విల్లన్లు అందరినీ హీరో ఛంపితేనే నాకొక చిన్న సంతృప్తి.
విశ్లేషణ (లాంటిది):
హీరో కొట్టడానికి బోలెడంత మంది విలన్స్ ఉన్నారు కాబట్టి NTR తనకొచ్చినట్టు చితక్కొట్టేసాడు. సంగీత దర్శకుడికి నిర్మాత డబ్బులిచ్చాడు కాబట్టి హీరో డ్యాన్స్ చెయ్యడానికి బోలెడన్ని పాటలు కూడా ఇచ్చాడు. సినిమా పేరు టెంపర్ మరియు హీరో గారికి ఒక వంశం ఉంది కాబట్టి ఆ రెండు కలిసేలా "నీ తాత టెంపర్. నీ అయ్యా టెంపర్. బాబాయి టెంపర్" అని అత్యద్భుతమైన సాహిత్యం రాశారు కవి గారు. వారి పాదాలకు నాయొక్క వందనాలు. సినిమా లో ఏం లేకపోయినా సరే ఒప్పుకుంటాం కానీ హీరో గారికి జతగా హీరోయిన్ లేకపోతే మేం ఒప్పుకోం అనే అభిమానులు తెలుగు హీరోలకి ఉండడం వల్ల హీరోయిన్ ని కూడా పెట్టాల్సి వచ్చింది.
మిగతావన్నీ పక్కన పెడితే కధనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పూరీ గారు పకడ్బందీగా రాసుకున్నారు. ప్రతి చిన్న సన్నివేశాన్ని కూడా లింక్ చేస్తూ ద్వితీయార్ధంని రాసుకున్న విధానం సూపర్. చాలా చిన్న సన్నివేశమే కదా అని అనుకున్నది కూడా రెండవ భాగం కి వచ్చేసరికి దాని విలువని తెలియచెస్తుంది.
ఉదాహరణకి NTR కాజల్ ని నువ్వేం తింటావ్ అని అడిగినప్పుడు పప్పు ఆవకాయ అప్పడం లాంటివి చెబుతుంది. అది చాలా మామూలు సన్నివేశం కానీ చివరిసారిగా నువ్వేం తింటావ్ అని పోలీసులు NTR ని అడిగినప్పుడు తాను కూడా అది గుర్తుకు తెచ్చుకుని చెప్పడం వల్ల ఆ సన్నివేశం అనుకున్న దానికన్నా ఎక్కువగా పండింది. ఇలాంటివి చాలా ఉన్నాయి.
మొదటి భాగంలో హీరోని అసహ్యించుకునే వరకు వెళ్తాం కాబట్టి ప్రేక్షకులతో ఆ charecter కనెక్ట్ అయ్యినట్టే. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ మంచి వాడిగా మారడానికి గల కారణం కూడా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. చాలా సినిమా ల్లో చూసినట్టు అకస్మాత్తుగా హీరో మంచివాడుగా మారడంలా కాకుండా దానికి బలమైన సన్నివేశాలు రాయడంలో దర్శకుడు విజయం సాధించాడు.
చివరి వాక్యం: NTR అభిమానులు సినిమా ఎలాగూ చూస్తారు. మిగతావాళ్ళకి సినిమా నచ్చుంటుందో లేదో తెలుసుకోవాలి అంటే వాళ్ళు కూడా సినిమా చూసి నిర్ణయం తీసుకుంటేనే ఉత్తమం.
:))
ReplyDeletechivari vaakyam.... :)
ReplyDeleteసినిమా పేరు టెంపర్ మరియు హీరో గారికి ఒక వంశం ఉంది కాబట్టి ఆ రెండు కలిసేలా "నీ తాత టెంపర్. నీ అయ్యా టెంపర్. బాబాయి టెంపర్" అని అత్యద్భుతమైన సాహిత్యం రాశారు కవి గారు. వారి పాదాలకు నాయొక్క వందనాలు ......... :P
ReplyDelete