కళ్ళు నులుముకుని లేచి కూర్చున్న...
అసలు ఎందుకు లేచాను నేను???
నేను పడుకుంటే కుంభకర్ణుడి అన్నలాంటి వాణ్ణి కదా!
ఏదో జరిగింది లేదంటే నేను అర్ధరాత్రి నిద్ర లేవడం ఏంటి..... ఏదో వేకువజామున 9 గంటలకు లేచాను అంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ లేనిది ఇవ్వాల్ల ఎందుకు అర్ధరాత్రి మెలకువ వచ్చింది.
సరే ఎలాగూ మెలకువ వచ్చింది కాబట్టి ట్విట్టర్ వాడడం కాకుండా ఏధైనా పనికొచ్చే పని చేద్దాం....
ఈ ఆలోచన ఏదో బావుంది అని అనిపించి వెంటనే "I don't tweet" అని ట్విట్టర్ లో ట్వీట్ చేసా....!
అసలు ఇంతకీ టైమ్ ఎంత అవుతుంది అని గడియారం వంక చూశాను.... ఆశ్చర్యం 12 మాత్రమే అవుతుంది....
శ్రీను వైట్ల, తన సినిమా హిట్ ఐనప్పుడు కూడా ఇంతలా షాక్ అయ్యి ఉండడు. నేను అంతలా షాక్ అవ్వడానికి గల కారణం నేను నిద్రపోయింది అర్ధరాత్రి ఒంటిగంటకి....
ఒంటిగంటకి నిద్ర పోతే 12 గంటలకి ఎలా నిద్ర లేస్తాను. కొంపతీసి మధ్యాహ్నం 12 అవుతుందా?
"What is the time now?" ట్విట్టర్ లో ట్వీట్ చేసి తలుపు తీసి బయటికి చూశాను. అంత చీకటిగానే ఉంది. చీకటి చూసి కొంచెం భయం వేసిన మాట నిజమే....
మళ్లీ గడియారం వంక చూశాను. నిజమే 12 అవుతుంది....
బాగా అలోచించాను ఏమీ జరిగి ఉంటుంది అని. ఇవ్వాల్ల సూర్య గ్రహణం అని అనుమానం వచ్చింది. కానీ దాన్ని ఎలా నిర్ధారించుకోవాలో తెలీక సూర్యగ్రహణం అని నిర్ణయానికి వచ్చేస్తే కానీ మనసు కుదుట పడడం లేదు కాబట్టి నిర్ణయానికి వచ్చేశాను....
అవును ఇవ్వాళ సూర్యగ్రహణమే... ఇంకాస్త బలంగా నిర్ణయించుకున్నాను....
"Today is Solar Eclipse" ట్వీట్ చేసా....
అప్పుడు వచ్చింది అద్భుతమైన ఆలోచన... నా మొబైల్లో మరియు ల్యాప్‌టాప్లో సమయం చూడాలన్నా ఆలోచన. ఇంత అధ్భుతమైన ఐడియాకి నా భుజం నేనే తట్టుకుని అభినందించుకున్నా...
మొబైల్ లో చూశాను సమయం 12.00 AM అని ఉంది. ల్యాప్‌టాప్ లో చూశాను 12.00 AM అనే ఉంది.
AM అంటే మధ్యాహ్నం కాదు కదా... అవును మధ్యాహ్నం కాదు. మరి ఒంటిగంటకి పడుకుంటే 12 కి లేవడం ఏంటి ఏం చేసిన అర్ధం కాలేదు.
"I am confused" ట్వీట్ చేసా...
ఆశ్చర్యం స్థానంలో భయం వచ్చింది. నిజంగా చాలా భయం వేసింది.
"I am dare enough to face anything" భయపడుతూనే ట్వీట్ వేశా...
ఏం చెయ్యాలి... ఎందుకు ఇలా జరిగింది.... నేను పడుకునే ముందు ఏమైన సమయం తప్పుగా చూశానా? లేదే నాకు బాగా గుర్తుంది. 1 అయింది కాబట్టే నేను నిద్రపోయాను. ఎందుకంటే ఒంటిగంటకి నిద్ర పోవడం నాకు అలవాటు. అవును నేను ఖచ్చితంగా ఒంటిగంటకే నిద్రపోయాను నాకు తెలుసు. మరి ఏం జరిగింది????
ఈ అర్ధరాత్రి పూట ఇంత భయంతో పరిశోధన చెయ్యవలసిన అవసరం నాకు కనిపించలేదు. కావున ఇప్పుడు నిద్రపోతాను. ఏదైన జరగని అని తెగించి ముసుగుతన్ని వణుకుతూ నిద్రపోయాను. ఆ వణకడం నిజ్జంగా చలి వెయ్యడం వల్లనే.... నమ్మకపోతే నేనేం చెయ్యలేను.
"Good Night all. Sweet Dreams" ట్వీట్ వేశాను.
నిద్రపోయాను......... నిద్రపోయాను...........నిద్రపో యాను.................. ఇప్పుడు నిజంగానే నిద్రపోయాను.
ఎంతసేపు పడుకున్నానో నాకు తెలీదు.... కానీ విచిత్రంగా మళ్లీ మెలకువ వచ్చింది. నాకు తెలిసి పడుకున్న తర్వాత మద్యలో ఇన్నిసార్లు మెలకువ రావడం ఇదే మొదటిసారి......
కళ్ళు తెరిచి చుట్టూ పక్కల జాగ్రత్తగా పరిశీలించాను.... అనుమానాస్పదంగా ఏమీ కనపడలేదు. ఏం భయం లేదు అని గట్టిగా నిర్ణయించుకున్నాక మెల్లిగా లేచి గడియారం వంక చూశాను....
సముద్రం ఉప్పొంగింది.... ఉరుములు మెరుపులు..... పిడుగు పడిన శబ్దం..... అచ్చం సినిమాల్లో చూపెట్టినట్టు అనుభూతి చెందాను. కారణం అప్పుడు సమయం సరిగ్గా 11 కావడమే.
"I am shocked" ట్వీట్ వేసి తీక్షణంగా ఆలోచించడం మొదలు పెట్టాను....
భూమి వెనక్కి తిరుగుతుందా లేదంటే ఎవడైనా శాస్త్రవేత్త చేసిన ఏదైన ప్రయోగం వికటించి ప్రపంచవ్యాప్తంగా సమయసూచికలు అన్ని వెనక్కి తిరుగుతున్నాయా....
"అసలేం జరిగింది.... ఏం జరుగుతుంది.... ఎలా జరుగుతుంది.... నాకిప్పుడే తెలియాలి.... తెలిసి తీరాలి...." ట్వీట్ వేశాను....
వెన్నులో వణుకు మొదలైంది.... మెల్లిగా తలుపు తీసి బాల్కనీలోకి వచ్చాను.... కనీసం రోజు వెలిగే దీపాలు కూడా వెలగడం లేదు.... అంత చిమ్మచీకటిగా ఉంది. ఎంత వేగంగా గదిలోకి వచ్చి తలుపు వేసుకున్నానో లెక్కకట్టడం సూపర్ కంప్యూటర్ కి కూడా సాధ్యం కాదు.....
ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలీనీ నాకు భయపడడం అలవాటు ఐపోయింది.....
నా గుండె చప్పుడు నాకే వినిపించి మరింత భయపెట్టసాగింది....
ధైర్యం కోసం "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" అని పాడుకుంటూ మళ్లీ నిద్రపోయాను.....
ఈ సారి కూడా మళ్లీ మెలకువ వచ్చింది కానీ చాలా సేపు పడుకున్నట్టు అనిపించింది.....
లేచి సమయం చూశాను....
ఎప్పటిలాగే సమయం వెనక్కి తిరుగుతుంది అని అర్ధం ఐపోయింది.... కారణం, సమయం 10 కావడమే.....
"If anything happens to me, I blame TIME" ట్వీట్ చేసా....
కాస్సేపు అలోచించాను....
మళయాళం రాని వాడు మళయాళం వార్తాపత్రికని పది సార్లు చదివితే మాత్రం ఏం లాభం.... ఎలాగూ అర్ధం కాదు కదా....! నా పరిస్థితి కూడా అలాగే ఉంది.... ఎంతసేపు ఆలోచిస్తేనేం.... ఏం జరిగిందో అంతుపట్టడం లేదు......
ఐన సరే ఓటమిని అంగీకరించాలి అని అనిపించక అలాగే ఆలోచించడం మొదలుపెట్టాను.....
కథానాయకుడు ప్రతినాయకుడు ఎంతసేపు కొట్టుకుంటేనేం చివరికి గెలిచేది కథానాయకుడే కదా....! అలాగే నా మీద విధి భారీ ఆధిక్యంతో గెలిచి నా ఓటమిని ఒప్పుకునేలా చేసింది. విధి ఎంత క్రూరమైనది.....
ఇక్కడ ఆలోచించవలసిన ఇంకో విషయం ఏంటి అంటే నేను సరిగ్గా 12, 11 మరియు 10 గంటలకి నిద్ర లేవడం. సరిగ్గా ఆ సమయానికి ఒక్క నిమిషం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నిద్ర లేవడం అసలు సాధ్యమేనా.....
ఏదో ఒకసారి అంటే యాదృఛ్ఛికం అనుకోవచ్చు కానీ ప్రతీసారి అలాగే జరుగుతుంది అంటే ఏమిటి అర్ధం....
నిండా మునిగిన వాడికి ఇంకా చలి ఏముంది..... ఏం జరగలేదు ఏం జరగలేదు అని నాకు నేనే సర్దిచెప్పుకుని పడుకున్నాను.....
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నామస్మరణం చేస్తూ బలవంతంగా నిద్రపోయాను....
మంచి నిద్రలో ఉండగా ఏదో రణగొణద్వనులు వినిపించి నా నిద్రను పాడు చేశాయి. చిరాకుతో నిద్ర లేచి ఆ శబ్దం ఎక్కడినుండి వస్తుంది అని చుట్టుపక్కల చూశాను. అది నా మొబైల్ నుండే వస్తుంది..... ఆశ్చర్యంతో దాన్ని పరీక్షించాను.....
అది... అలారం..... ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్......... అంటుంది
అలారం ఆపేసి సమయం చూశాను.... 7.13 AM అవుతుంది.....
కళ్ళు నులుముకుని మళ్లీ చూశాను.... నిజంగా 7.13 AM అవుతుంది.....
అంటే........... అంటే......... మెల్లిగా తెరలు తెరలుగా గుర్తుకు రాసాగింది ఇప్పటికీవరకు జరిగిన విషయం.....
ట్విట్టర్ చూశాను.... నేను రాత్రంతా వేసిన ట్వీట్స్ కనిపించలేవు...........
హమ్మయ్య ఇప్పటిదాకా వచ్చింది కల.................... అవును కలే................
హాయిగా ఊపిరిపీల్చుకున్నాను......
"Good Morning" ట్వీట్ వేశాను....
Interesting story
ReplyDeleteNee bondha la undi
ReplyDeleteHey bhagavan!! naa tala tirugutoondi !!
ReplyDeleteచాలా బాగుంది :)
ReplyDeletehahah..funny :)
ReplyDeleteAwesome
ReplyDelete