నేను పొట్ట కూటి కోసం పూణే
కి వచ్చిన రోజులు అవి……..
నేను తిండి లేకపోయిన సరే
బతకగలను కాని ఇంటర్నెట్ లేకుండా బతకలేను అన్న విషయం నెట్ లేకుండా గడిపిన 2 రోజుల్లో తెలిసి వచ్చింది.
లేడికి లేచిందే పరుగు అని
రిలయన్స్ నెట్ అడ్వర్టయిజ్‌మెంట్ కనపడగానే కనెక్షన్ కి ఆర్డర్ ఇచ్చాను. అది నేను
చెసిన 159 వ తప్పని తెలుసుకోడానికి
ఆగడు సినిమా ఫ్లాప్ అని తెలుసుకునేంత సమయం కూడా పట్టలేదు.
వాడికి ఆర్డర్ ఇచ్చిందే
తడవుగా కొట్టుకుందాం అంటే ఈగలు దొరకని వాడికి ఒకేసారి 100 ఈగలు దొరికినట్టు తెగ ఆనంద పడిపోయి అప్పటికప్పుడు కనెక్షన్
ఇచ్చి నీకుందిరోయ్ అన్నట్టు చూసి వెళ్లాడు.
నా వాడకానికి లిమిటెడ్
ప్లాన్స్ పనికి రావు అని అన్ లిమిటెడ్ ప్లాన్ తీసుకుని వాడు అడిగినంత డబ్బులు
వాడి మొహాన కొట్టి వాడడం మొదలు పెట్టాను. అప్పటినుండీ EVV గారి సినిమా లో కథానాయిక కు ఉండే కష్టాలు లాంటివి స్టార్ట్
అయ్యాయి. ఎప్పుడైన పొరపాటున ఎడారి లో మినరల్ వాటర్ దొరికినట్టుగా ఒక 10 నిమిషాలు నెట్ వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ మూవి ప్రీమియర్
షో కి ఫ్రీ గా టికెట్ దొరికినంత ఆనంద పడేవాణ్ణి.
నేను ఏదో నా సిస్టంలో ప్రొబ్లెమ్స్ ఉన్నాయి అనుకునే వాణ్ణి కాని ఆ దగుల్భాజీ రిలయన్స్ వారి సర్వీస్ అలాగే ఉంటుంది అని కనెక్షన్ తీసేసెంత వరకు తెలిలేదు.
నాకు కనెక్షన్ ఇచ్చిన
మేనేజర్ కి ఫోన్ చేస్తే వాడు తమన్ ఇచ్చిన మ్యూజిక్ లాగా సిచువేషన్ కి అస్సలు
సంబంధం లేని సాంగ్స్ ఇచ్చినట్టు దిక్కుమాలిన కారణాలు అన్ని చెప్పాడు. ఫైనల్ గా
అర్ధం ఐన నీతి ఏంటంటే నువ్వు ఆల్రెడీ డబ్బులు కట్టేసావు కాబట్టి తరువాత బిల్
వచ్చేంత వరకు మేం ఇలాగే చేస్తాం నీ దిక్కున్న చోట చెప్పుకో అని. ఫోన్ పెట్టేస్తూ
పెట్టేస్తూ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు అని కూర లో
కరివేపాకు ల పనికి రాని సలహా ఒకటి ఇచ్చి చచ్చాడు. ఇంకా అక్కడినుండి నాకు కస్టమర్
కేర్ కి యుద్ధం ప్రారంభం.
మొదటి సారి కస్టమర్ కేర్ కి
కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో మర్యాదగా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని 24 గంటల్లో మేము సమస్యను పరిష్కరిస్తాం అని బాపు గారి సినిమాలో
హీరోయిన్ ఉన్నంత ముద్దుగా పద్దతిగా చెప్పారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం
అని ఆ ఒక రొజుఎలాగోలా కాలయాపన చేసాను.
25 గంటల 6 నిమిషాలకు 2వ సారి కాల్ చేసినప్పుడు,
మీ ప్రాబ్లం సాల్వ్ ఐపొయింది సర్ అని రామ్
గోపాల్ వర్మ ఫ్యామిలీ సినిమా తీసినట్టు చెప్పాడు. ప్రాబ్లం సాల్వ్ ఐపొయింది అని ఒక
స్టేటస్ అప్‌డేట్ చెయ్యగానే అది నిజం అయిపోదు మాకు నెట్ కూడా రావాలి కదరా బాత్రూమ్
లొ బిర్యానీ తినే తింగరి సన్నాసి అంటే మళ్లీ ఒక కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యండి సర్ 24 గంటలలో సాల్వ్ చెసేస్తాం అని మెడిటేషన్ చెసేవాడికి కూడా
ఇరిటేషన్ తెప్పించే సమాధానం చెప్పాడు. మంగలి వాడు కత్తి మెడ మీద పెట్టినప్పుడు
వాడితో గొడవ పడకూడదు అని తెల్సిన తెలివైన వాణ్ణి కాబట్టి అన్ని మూసుకుని మరో 24 గంటలు వేచిచూద్దాం అని నిర్ణయించుకున్న.
అలా ఆ రెండు రోజులు భారంగా
గడిచిపోయాయి. 3 వ రోజు కూడా కస్టమర్ కేర్
వాడు నా కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు అని కాల్ చేసాను. మళ్లీ వాడు
శ్రీను వైట్ల సినిమా లో ఉన్న రొటీన్ కథ లాగ మళ్లీ ప్రాబ్లం సాల్వ్ ఐపొయింది సర్
అని చెప్పాడు. మాకు ఇంక నెట్ రాలేదు అని చెప్తే మళ్లీ ఒక కంప్లైంట్ రిజిస్టర్
చెయ్యండి సర్ 24 గంటలలో సాల్వ్ చెసేస్తాం
అని ఎంతో వినయంగా విధేయతతో దేశంలో ఉన్న ప్రొబ్లెంస్ అన్ని మేమే సాల్వ్ చేసేస్తాం
అన్నంత గర్వంగా చెప్పాడు.
ఇంక నా ఓపిక నశించి నువ్వు
వద్దు నీ పాడు నెట్ వద్దు. మీ సేవలు చాలు మాకు మేము చాల బాగా బుద్ది తెచ్చుకున్నాం
వీలైనంత తొందరగా డీ-యాక్టివేట్ చేసేస్తే నా మొబైల్ లో ఉన్న 2G నెట్‌వర్క్ తోనే సినిమా రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్
వచ్చిన నిర్మాత మాదిరిగా సంతోషంగా ఉంటా అని సెలవిచ్చి యోగా చెయ్యడం మొదలుపెట్టాను.
అది గడిచిన 7 రోజులకు (అంటే అప్పటికి మేము కనెక్షన్ తీసుకుని 10 రోజులు అవుతున్నట్టు లెక్క) మాకు ఒక బిల్ ఇచ్చాడు. దాని
సారాంశం ఏంటంటే మీరు ఇదివరకే 1800 కట్టేసారు ఇంక 300 కట్టేస్తే సరిపోతుంది అని. మేము తీసుకున్న ప్లాన్ 900
అన్ లిమిటెడ్. దానికి వాడు 10 రోజులకి అదీ వాడని నెట్ కి 2100 ఎలా బిల్ ఏసాడు అని ఆలోచిస్తే తేలిన విషయం ఏంటంటే “డబ్బులు దొబ్బడం రిలయన్స్ జన్మ హక్కు” అనేది వాడు పాటించే ఏకైక సూత్రం అని.
అప్పటి నుండి ఎవడైనా నా
ముందు రిలయన్స్ ని పొగిడితే రాజమౌళి సినిమా లో విలన్ అంత పవర్‌ఫుల్ గా
మారుతున్నట్టు నా స్నేహితులు చెప్పే వరకు తెలిసిరాలేదు.
chala baga express chesaru. chala funnyga undi. same problem naku kuda jarigindi kakapothe Beam net vaaditho. Net Dealers antha anthe. pani takkuva bill ekkuva la untundi valla doraani.
ReplyDeleteThank you Bhagavandas garu. కనెక్షన్ తీసి ఇన్ని రోజులు ఐన ఇప్పటికీ బిల్లులు వేస్తూనే ఉన్నారు. వాళ్ళను నమ్మి నెట్ కనెక్షన్ పెట్టుకోవడం అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే.
DeleteNee praasa. . Vaadina padhaalu trivikram ni gurthu chesaay :D
ReplyDelete